Sign in

Stock market : మొన్న భారీ లాభాలు, నిన్న నష్టాలు.. ఈ రోజు స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి?

Gift Nifty live : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​, ముడి చమురు ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 10, 2026, 08:16:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా- ఇరాన్​ మధ్య కాల్పుల విరమణ నేపథ్యంలో బుధవారం భారీగా లాభపడిన దేశీయ స్టాక్​ మార్కెట్​లు, అదే కాల్పుల విరమణపై అనిశ్చితి కారణంగా గురువారం భారీగా నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 931 పాయింట్లు పడి 76,632 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 222 పాయింట్లు పతనమై 23,775 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 882 పాయింట్లు కోల్పోయి 54,822 వద్దకు చేరింది.

స్టాక్​ మాార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..
స్టాక్​ మాార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,711.19 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 955.90 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“టెక్నికల్​ పరంగా నిఫ్టీ50కి 23,920- 24,000 లెవల్స్​ కీలక రెసిస్టెన్స్​గా ఉన్నాయి. 23,500- 23,580 జోన్​ కీలక సపోర్ట్​గా ఉంది. అదే సమయంలో ఇండియా విక్స్​ 3.71శాతం పడింది. ఇది స్థిరత్వానికి సంకేతం,” అని చాయిస్​ బ్రోకింగ్​ ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ సుమీత్​ బగాడియా తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.58 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.62శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.8 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్​ మధ్య అనిశ్చితి నేపథ్యంలో బ్రెంట్​ క్రూడ్​ ధర శుక్రవారం 0.8శాతం పెరిగి బ్యారెల్​కి 96.75 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

జీఈ వెర్నోవా టీ అండ్​ డీ ఇండియా- బై రూ. 3911, స్టాప్​ లాస్​ రూ. 3750, టార్గెట్​ రూ. 4200

ఐఎస్​జీఈసీ హెవీ ఇంజినీరింగ్​- బై రూ. 953, స్టాప్​ లాస్​ రూ. 914, టార్గెట్​ రూ. 1020

వారీ ఎనర్జీస్- బై రూ. 3232, స్టాప్​ లాస్​ రూ. 3088, టార్గెట్​ రూ. 3450

సెనోరెస్​ ఫార్మా- బై రూ. 805, స్టాప్​ లాస్​ రూ. 3088, టార్గెట్​ రూ. 3450

పవర్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​- బై రూ. 428, స్టాప్​ లాస్​ రూ. 410, టార్గెట్​ రూ. 460

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More