Stock market : ముడి చమురు ధరలు ఢమాల్​- ఈ రోజు స్టాక్​ మార్కెట్​లకు అతి భారీ లాభాలు!

Gift nifty today live : ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్న వార్త వచ్చేసింది. అమెరికా- ఇరాన్​ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఫలితంగా ముడి చమురు ధరలు భారీగా పడ్డాయి, స్టాక్​ మార్కెట్​లు పెరుగుతున్నాయి. 

Published on: Apr 8, 2026, 08:15:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 510 పాయింట్లు పెరిగి 74,617 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 155 పాయింట్లు వృద్ధిచెంది 23,124 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 107 పాయింట్లు పెరిగి 52,716 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..

ఇరాన్​తో యుద్ధాన్ని రెండు వారాలు నిలిపివేస్తూ, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఫలితంగా, ముడి చమురు ధరలు అతి భారీగా పడ్డాయి. అదే సమయంలో ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో దూసుకెళుతున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 8,692.11 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,979.50 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ అతి భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 680 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.18 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.08శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.10 శాతం పెరిగింది.

కాగా ట్రంప్​ చేసిన కాల్పుల విరమణ ప్రకటనతో అమెరికా ఫ్యూచర్స్​ సైతం భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి.

ఇరాన్​తో కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్​ చేసిన ప్రకటనను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇక తాజా పరిణామాల మధ్య ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి. జపాన్ నిక్కీ 4.5శాతం, సౌత్​ కొరియా కాస్పీ 5.3శాతం జంప్​ అయ్యాయి.

ముడి చమురు ధరలు..

అమెరికా- ఇరాన్​ మధ్య కాల్పుల విరమణతో పాటు హర్ముజ్​ జలసంధి రీఓపెన్​ నేపథ్యంలో ముడి చమురు ధరలు అతి భారీగా పడ్డాయి. ప్రస్తుతం బ్రెంట్​ క్రూడ్ 13.86శాతం పడి బ్యారెల్​కు 94.13 డాలర్లకు చేరింది. ఒకానొక సమయంలో బ్రెంట్​ క్రూడ్​ 15శాతం వరకు కూడా ఫాల్​ అయ్యింది.

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

గోదావరి పవర్​ అండ్ ఇస్పాట్​ లిమిటెడ్- బై రూ. 285, స్టాప్​ లాస్​ రూ. 273, టార్గెట్​ రూ. 300

డేటా పాటర్న్స్​ ఇండియా- బై రూ. 3209, స్టాప్​ లాస్​ రూ. 2088, టార్గెట్​ రూ. 2400

వెల్​స్పన్​ కార్ప్​- బై రూ. 879, స్టాప్​ లాస్​ రూ. 837, టార్గెట్​ రూ. 940

శార్దా ఎనర్జీ అండ్ మినరల్స్​- బై రూ. 528, స్టాప్​ లాస్​ రూ. 505, టార్గెట్​ రూ. 565

డీఈఎఫ్​ డెవలప్​మెంట్​ ఇంజినీర్స్​- బై రూ. 313, స్టాప్​ లాస్​ రూ. 29, టార్గెట్​ రూ. 335

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More