Stocks to buy today : చమురు ధర జంప్- గిఫ్ట్​ నిఫ్టీ డౌన్​- స్టాక్​ మార్కెట్​కి ఈ రోజు నష్టాలు?

Stock market updates : ఏప్రిల్​ 6, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 6, 2026, 08:15:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుడ్​ ఫ్రైడే నేపథ్యంలో శుక్రవారం స్టాక్​ మార్కెట్​లకు సెలవు. ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 185 పాయింట్లు పెరిగి 73,320 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 34 పాయింట్లు వృద్ధిచెంది 22,713 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 51,549 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..

ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్​ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ స్టాక్​ మార్కెట్​లో తీవ్ర అస్థిరత నెలకొంది. దీనికి ముగింపు ఎప్పుడు పడుతుంది? అన్న ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం లేకపోవడంతో సూచీల్లో ఒత్తిడి కనిపిస్తోంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 9,931.13 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,208.41 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

PPF : మెచ్యూరిటీ కంటే ముందే పీపీఎఫ్​ నుంచి డబ్బు విత్​డ్రా చేసుకోవచ్చా? రూల్స్​ ఇవి..

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 135 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“టెక్నికల్స్​ని చూస్తే.. నిఫ్టీ50కి 22,450- 22,500 లెవల్స్​ వద్ద సపోర్ట్​ ఉంది. 22,840- 22,900 లెవల్స్​ వద్ద రెసిస్టెన్స్​ ఉంది,” అని చాయిస్​ బ్రోకింగ్​కి చెందిన ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ సుమీత్​ బగాడియా తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గుడ్​ ఫ్రైడే నేపథ్యంలో శుక్రవారం అమెరికా స్టాక్​ మార్కెట్​లకు కూడా సెలవే. ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అక్కడి స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.13 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.11శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.18 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లలో చాలా వరకు సోమవారం సెలవులో ఉన్నాయి. మిగిలినవి ఫ్లాట్​గా ట్రేడ్​ అవుతున్నాయి.

చమురు ధరలు..

ఇరాన్​ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్​ క్రూడ్​ 1.6శాతం పెరిగి బ్యారెల్​కు 110.74 డాలర్లకు చేరింది.

FD returns : సీనియస్​ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లను ఆఫర్​ చేస్తున్న టాప్​ బ్యాంకులు ఇవి..

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఇన్ఫోసిస్- బై రూ. 1300.8, స్టాప్​ లాస్​ రూ. 1240, టార్గెట్​ రూ. 1400

కళ్యాన్ జ్యువెల్లర్స్​- బై రూ. 394.35, స్టాప్​ లాస్​ రూ. 374, టార్గెట్​ రూ. 430

సుప్రియ లైఫ్​సైన్సెస్​- బై రూ. 394.35, స్టాప్​ లాస్​ రూ. 374, టార్గెట్​ రూ. 430

ఎంఎం ఫోర్జింగ్స్​- బై రూ. 412.05, స్టాప్​ లాస్​- రూ. 390, టార్గెట్​ రూ. 460

వేదాంత- బై రూ. 687.65, స్టాప్​ లాస్​ రూ. 650, టార్గెట్​ రూ. 755

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More