Stock market holiday : ట్రేడర్స్, ఇన్వెస్టర్లకు అలర్ట్- ఈరోజు స్టాక్​ మార్కెట్లకు సెలవు! ఎందుకంటే..

దీపావళి-బలిపాడ్యమి పర్వదినం సందర్భంగా నవంబర్ 10, మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలతో పాటు ఎంసీఎక్స్ నూతన వేళలు, తదుపరి సెలవుల వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Nov 10, 2026, 08:15:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దీపావళి పండుగ సంబరాల వేళ దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు కీలక అలర్ట్. 'దీపావళి-బలిపాడ్యమి' పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 10 మంగళవారం రోజున దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీని ప్రకారం దేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్​ఛేంజీల్లో బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్ (బీఎస్​ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ)లలో రోజంతా ఈక్విటీ లావాదేవీలు నిలిచిపోనున్నాయి.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

సోమవారం తర్వాత స్టాక్ మార్కెట్లు తిరిగిన బుధవారం యథాతథంగా కార్యకలాపాలు సాగిస్తాయి.

ఎంసీఎక్స్, ఎన్‌సీడీఈఎక్స్ కమోడిటీ మార్కెట్ల వేళలు..

స్టాక్ మార్కెట్లు పూర్తిగా మూతపడినప్పటికీ కమోడిటీ మార్కెట్ కొన్ని గంటల పాటు అందుబాటులో ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద కమోడిటీ ఎక్స్​ఛేంజ్ అయిన 'మల్టీ కమోడిటీ ఎక్స్​ఛేంజ్ ఆఫ్ ఇండియా' (ఎంసీఎక్స్)లో ఉదయం సెషన్ (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) ట్రేడింగ్ నిలిచిపోతుంది. తిరిగి సాయంత్రం సెషన్ 5 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు సాధారణ పద్ధతిలో లావాదేవీలు కొనసాగుతాయని యాజమాన్యం స్పష్టం చేసింది.

మరోవైపు నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​సీడీఈఎక్స్) మాత్రం మంగళవారం రోజంతా పూర్తిగా మూతపడనుంది.

దీపావళి నుంచి 4వ రోజు వచ్చే రోజును బలిపాడ్యమి అంటారు. అసుర రాజు బాలి భూమికి తిరిగి వచ్చిన రోజుగా దీనిని పరిగణిస్తారు.

2026లో మిగిలిన స్టాక్ మార్కెట్ సెలవులు..

కాలెండర్ సంవత్సరం 2026లో ప్రకటించిన మొత్తం 16 స్టాక్ మార్కెట్ సెలవుల్లో ఇప్పటికే 13 సెలవులు పూర్తయ్యాయి. నవంబర్ 10 నాటి సెలవు తర్వాత ఈ ఏడాది మిగిలిన ప్రధాన సెలవులు ఇవే:

నవంబర్ 24 (మంగళవారం): ప్రకాష్ గుర్పురబ్ శ్రీ గురునానక్ దేవ్‌ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు.

డిసెంబర్ 25 (శుక్రవారం): క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని బిఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ మూతపడతాయి.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఇలా..

ఇత సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 107 పాయింట్లు పెరిగి 81,107 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 58 పాయింట్లు వృద్ధిచెంది 25,045 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 891 పాయింట్లు పెరిగి 59,741 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 7,212.22 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,172.53 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ముడి చమురు ధర..

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర 95 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.6శాతం పడి బ్యారెల్​కు 91.9 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More