Stock Market : ఇరాన్​పై అమెరికా దాడి- చమురు ధర జంప్! స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి?

Stocks to buy : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్, చమురు ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 26, 2026, 08:14:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

US Iran War news : చమురు ధరలు డౌన్ అవ్వడంతో సోమవారం ట్రేడింగ్​​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1074 పాయింట్లు పెరిగి 76,489 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 312 పాయింట్లు వృద్ధిచెంది 24,032 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1238 పాయింట్లు పెరిగి 55,294 వద్దకు చేరింది.

ఇరాన్​పై అమెరికా దాడి- ఈ రోజు స్టాక్​ మార్కెట్ పరిస్థితేంటి?
ఇరాన్​పై అమెరికా దాడి- ఈ రోజు స్టాక్​ మార్కెట్ పరిస్థితేంటి?

కాగా మంగళవారం ఉదయం ఇరాన్​పై అమెరికా దాడులు జరిపింది. ఫలితంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఈ పరిణామాల మధ్య ముడి చమురు ధర అమాంతం పెరిగింది, స్టాక్​ మార్కెట్​లలో భయాలు పెరిగాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 821.75 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,856.88 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 కీలక 24000 దాటడమే కాదు.. డైలీ చార్ట్​లో బలమైన బుల్లిష్ క్యాండిల్​ని ఫార్మ్ చేసింది. ఇది సానుకూల సంకేతం. ఇక్కడి నుంచి మరింత పైకి వెళ్లే అవకాశం ఉంది. సూచీకి 24,120 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అది దాటితే 24,300 వరకు వళ్లొచ్చు. 23,850 వద్ద కీలక సపోర్ట్​ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మెమోరియల్​ డే హాలీడే కారణంగా అమెరికా స్టాక్​ మార్కెట్​లకు సోమవారం సెలవు. డౌ జోన్స్, ఎస్​ అండ్​ పీ 500, నాస్​డాక్ ఫ్యూచర్స్​ మాత్రం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

చమురు ధర..

అమెరికా- ఇరాన్ మధ్య గత కొన్ని నెలలుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇరు దేశాల మధ్య శాంతి కోసం చర్చలు జరుగుతున్నట్టు సోమవారం రాత్రి వరకు వార్తలు వచ్చాయి. కానీ మంగళవారం ఉదయం మాత్రం సీన్​ రీవర్స్​ అయ్యింది! ఇరాన్ బోట్లపై అమెరికా దాడులు చేసింది. మిసైల్ లాంచ్​ సైట్లపైనా విరుచుకుపడింది. ఈ పరిణామాలతో చమురు ధరలు జంప్​ అయ్యాయి. సోమవారం దాదాపు 7శాతం పతనమైన బ్రెంట్​ క్రూడ్.. మంగళవారం 1.5శాతం పెరిగి బ్యారెల్​కి 97.56కి చేరింది.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఇండస్ టవర్- బై రూ. 439, స్టాప్​ లాస్​ రూ. 420, టార్గెట్​ రూ. 475

సెనైడర్ ఎలక్ట్రిక్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్- బై రూ. 1365, స్టాప్​ లాస్​ రూ. 1305, టార్గెట్​ రూ. 1480

భారత్​ పెట్రోలియం కార్పొరేషన్- బై రూ. 308, స్టాప్​ లాస్​ రూ. 294, టార్గెట్​ రూ. 333

పంజాబ్ నేషనల్​ బ్యాంక్- బై రూ. 106, స్టాప్​ లాస్​ రూ. 101, టార్గెట్​ రూ. 115

యూపీఎల్- బై రూ. 652, స్టాప్​ లాస్​ రూ. 623, టార్గెట్​ రూ. 710

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More