Stock market : చమురు ధర ఢమాల్- స్టాక్​ మార్కెట్​లకు ఈరోజు భారీ లాభాలు! ఈ స్టాక్స్​ ట్రాక్ చేయండి..

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​, చమురు ధరలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: May 25, 2026, 08:14:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 232 పాయింట్లు పెరిగి 75,415 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 65 పాయింట్లు వృద్ధిచెంది 23,719 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 616 పాయింట్లు పెరిగి 54,055 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..

అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు చిగురించిన నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ముడి చమురు ధర భారీగా పతనమైంది. ఫలితంగా ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,440.47 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,003.53 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 250 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 23,150- 23,250 జోన్ తక్షణ సపోర్ట్​గా ఉంది. అది బ్రేక్ అయితే సూచీ 22,900 మార్క్​ వరకు వెళ్లొచ్చు. ఇక 23,800- 24,00 లెవల్స్ కీలక రెసిస్టెన్స్​గా ఉన్నాయి. అది దాటితే సూచీ 24,500- 24,650 వరకు వెళ్లొచ్చు,” అని రెలిగేర్​ బ్రోకింగ్​కి చెందిన అజిత్​ మిశ్రా తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.58 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.27శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.19 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి.

భారత దేశ సూచీలు ఇంకా నష్టాల్లో కొట్టుమిట్టాడుతుండగా.. అమెరికా, జపాన్ వంటి స్టాక్​ మార్కెట్​లు ప్రతిరోజూ నూతన గరిష్ఠాలను హిట్​ చేస్తున్నాయి. రూపాయి పతనం, ఎఫ్​ఐఐల భారీ అమ్మకాలు వంటి కారణాలతో మన స్టాక్​ మార్కెట్​లు ఇంకా తేరుకోలేకపోతున్నాయి.

చమురు ధర..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో బ్రెంట్ క్రూడ్​ ధర ఏకంగా 5.08శాతం క్రాష్​ అయ్యింది. ప్రస్తుతం బ్యారెల్​కు 98.28 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

మీషో- బై రూ. 198, స్టాప్​ లాస్​ రూ. 195, టార్గెట్​ రూ. 205

మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్- బై రూ. 1652, స్టాప్​ లాస్​ రూ. 1620, టార్గెట్​ రూ. 1750

జీఐపీసీఎల్- బై రూ. 149, స్టాప్​ లాస్​ రూ. 145, టార్గెట్​ రూ. 160

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More