Stock market : ఈరోజు స్టాక్ మార్కెట్‌కి లాభాలా? నష్టాలా? ఏ స్టాక్స్‌లో ట్రేడింగ్ బెస్ట్?
Stocks to buy : మే 22, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
Gift Nifty live : గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 135 పాయింట్లు పడి 75,183 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 4 పాయింట్లు కోల్పోయి 23,655 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 123 పాయింట్లు పడి 53,439 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,891.21 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,492.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 డైలీ చార్ట్‌లో భారీ రెడ్ క్యాండిల్ ఏర్పడింది. 23,800 లెవల్ వద్ద కీలక రెసిస్టెన్స్‌ని దాటకపోయింది. సూచీ 23,300- 23,800 లెవల్స్ మధ్య రేంజ్ బౌండ్లో కొనసాగుతోంది. 23,850- 23,900 లెవల్స్ దాటితే నిఫ్టీ50లో అప్‌ట్రెండ్ కనిపించవచ్చు. 23,500 వద్ద సపోర్ట్ దక్కొచ్చు,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.55 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.17శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.09 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితి నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ 2.3శాతం పెరిగి బ్యారెల్‌కి 104.96 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
డా. అగర్వాల్స్ హెల్త్ కేర్- బై రూ. 481, స్టాప్ లాస్ రూ. 460, టార్గెట్ రూ. 520
నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్- బై రూ. 2161, స్టాప్ లాస్ రూ. 2065, టార్గెట్ రూ. 2300
జమ్ము కశ్మీర్ బ్యాంక్- బై రూ. 140, స్టాప్ లాస్ రూ. 130, టార్గెట్ రూ. 150
లింకన్ ఫార్మా- బై రూ. 732, స్టాప్ లాస్ రూ. 700, టార్గెట్ రూ. 785
ఆర్తీ ఇండస్ట్రీస్- బై రూ. 482, స్టాప్ లాస్ రూ. 460, టార్గెట్ రూ. 520
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


