Stock market today : నష్టాలే, నష్టాలు- ఈ రోజు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఇదే! కారణం..
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, ముడి చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 161 పాయింట్లు పడి 75,238 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 46 పాయింట్లు కోల్పోయి 23,644 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 419 పాయింట్లు పడి 53,710 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,329.17 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,958.82 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 76 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 23,200 వద్ద బలమైన సపోర్ట్ ఉంది. అది హోల్డ్ అయితే కరెక్షన్ ఆగుతుంది. అదే సమయంలో సూచీకి 24,300 లెవల్ రెసిస్టెన్స్‌గా ఉంది. అది దాటితేనే నిఫ్టీ50 పెరుగుతుందన్న క్లారిటీ వస్తుంది,” అని ప్రభుదాస్ లిల్లాధేర్కి చెందిన వైస్ ప్రెసిడెంట్, టెక్నికల్ రీసెర్చ్ వైశాళి పరేఖ్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.07 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.24శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.54 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
ఇరాన్‌పై అమెరికా దాడులు చేస్తుందన్న వార్తల నేపథ్యంలో ముడి చమురు ధర అమాంతం పెరిగిపోయింది. క్రూడ్ ఆయిల్ ధర 2.33శాతం పెరిగి బ్యారెల్‌కి 111.81 డాలర్లకు వెళ్లిపోయింది.
స్టాక్స్ టు బై..
ఆస్ట్రాజెనెకా ఫార్మా- బై రూ. 8475, స్టాప్ లాస్ రూ. 8350, టార్గెట్ రూ. 8650
సుజ్లాన్ ఎనర్జీ- బై రూ. 53.8, స్టాప్ లాస్ రూ. 52, టార్గెట్ రూ. 57
ప్రిస్మ్ జాన్సన్- బై రూ. 128, స్టాప్ లాస్ రూ. 125, టార్గెట్ రూ .133
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
సంవర్థన మథర్సన్ ఇంటర్నేషనల్- బై రూ. 130, స్టాప్ లాస్ రూ. 124.5, టార్గెట్ రూ. 140
ఇండో కౌంట్ ఇండస్ట్రీస్- బై రూ. 290, స్టాప్ లాస్ రూ. 277, టార్గెట్ రూ. 315
హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంర్ప్రైజెస్- బై రూ. 637, స్టాప్ లాస్ రూ. 607, టార్గెట్ రూ. 690
గ్రిండ్‌వెల్ నార్టన్- బై రూ. 1859, స్టాప్ లాస్ రూ. 1780, టార్గెట్ రూ. 2000
హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్‌ప్లొరేషన్ కంపెనీ- బై రూ. 169, స్టాప్ లాస్ రూ. 160, టార్గెట్ రూ. 185
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


