Stock market : చమురు ధరకు మళ్లీ రెక్కలు! భారత స్టాక్​ మార్కెట్​లు ఢమాల్- ఈరోజు భారీ నష్టాలు తప్పవా?

Gift nifty live : అమెరికా- ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్​లు నెగిటివ్​లోకి టర్న్​ అయ్యాయి. గిఫ్ట్​ నిఫ్టీ సైతం భారత స్టాక్​ మార్కెట్​లకు నెగిటివ్​ ఓపెనింగ్​నే సూచిస్తోంది. పూర్తి వివరాలు..

Published on: Jul 13, 2026, 08:15:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 828 పాయింట్లు పెరిగి 77,569 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 244 పాయింట్లు వృద్ధిచెంది 24,207 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 793 పాయింట్లు పెరిగి 58,046 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

కాగా.. వారాతంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి! అమెరికా- ఇరాన్ దేశాలు మరోసారి పరస్పర దాడులకు దిగాయి. ఫలితంగా స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్​ని మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రపంచ స్టాక్​ మర్కెట్​లు మరోసారి కుదేలయ్యాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,603.72 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,019.68 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 190 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

నిఫ్టీ50కి 24,500- 24,600 జోన్ వద్ద రెసిస్టెన్స్​ ఉందని, 23,000 వద్ద సపోర్ట్​ ఉందని స్టాక్ మార్కెట్​ నిపుణులు చెబుతున్నారు. అయితే, అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించాలని, బిగినర్లు ట్రేడింగ్​కే దూరంగా ఉండటం ఉత్తమం అని సూచిస్తున్నారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. కానీ వారాంతంలో పరిస్థితులు మారిపోవడంతో యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ నెగిటివ్​లో ట్రేడ్ అవుతున్నాయి.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో ముడి చమురు ధర భారీగా పెరిగింది. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో బ్రెంట్​ క్రూడ్ 3శాతం పెరిగి బ్యారెల్​కి 78 డాలర్లు దాటేసింది.

బ్రేకౌట్ స్టాక్స్ టు బై..

రాజ్​రతన్ గ్లోబల్ వైర్- బై రూ. 482, స్టాప్​ లాస్​ రూ. 455, టార్గెట్​ రూ. 530

జిందాల్ పాలీ ఫిల్స్మ్- బై రూ. 718, స్టాప్​ లాస్​ రూ. 685, టార్గెట్​ రూ. 780

డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్- బై రూ. 900, స్టాప్​ లాస్​ రూ. 860, టార్గెట్​ రూ. 980

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్- బై రూ. 1180, స్టాప్​ లాస్​ రూ. 1125, టార్గెట్​ రూ. 1290

గోద్రేజ్ ప్రాపర్టీస్- బై రూ. 2133, స్టాప్ లాస్​ రూ. 2025, టార్గెట్​ రూ. 2350

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More