బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 299 పాయింట్లు పెరిగి 74,828 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 118 పాయింట్లు వృద్ధిచెంది 23,447 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 333 పాయింట్లు పెరిగి 56,549 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,617.45 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,341.46 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 140 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.68 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.75శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.1 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
నిన్నటి వకు 100 డాలర్ల దిగువన ఉన్న ముడి చమురు ధర అమెరికా- ఇరాన్ అనిశ్చితుల కారణంగా మరొకసారి పెరిగింది. ఫలితంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కి 103 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
టాటా స్టీల్- బై రూ. 191, స్టాప్ లాస్ రూ. 183, టార్గెట్ రూ. 207
{{/usCountry}}టాటా స్టీల్- బై రూ. 191, స్టాప్ లాస్ రూ. 183, టార్గెట్ రూ. 207
{{/usCountry}}రాడికో ఖైతాన్- బై రూ. 4602, స్టాప్ లాస్ రూ. 4380, టార్గెట్ రూ. 5060
జీఎన్ఎఫ్సీ- బై రూ. 623, స్టాప్ లాస్ రూ. 593, టార్గెట్ రూ. 680
ఆప్టస్- బై రూ. 251, స్టాప్ లాస్ రూ. 240, టార్గెట్ రూ. 273
కేఆర్‌బీఎల్- బై రూ. 405, స్టాప్ లాస్ రూ. 386, టార్గెట్ రూ. 446