Stock market : గిఫ్ట్​ నిఫ్టీ డౌన్- స్టాక్​ మార్కెట్​లు నష్టాలు? ఈ స్టాక్స్​తో మాత్రం లాభాలు!

Stocks to buy today : జూన్ 4, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 04, 2026 8:14 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 304 పాయింట్లు పడి 74,346 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 78 పాయింట్లు కోల్పోయి 23,406 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 471 పాయింట్లు పెరిగి 54,186 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్​ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్​ లేటెస్ట్ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 5,616.56 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,740.89 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 మళ్లీ రేంజ్​ బౌండ్​లోకి జారుకుంది. 24,000 లెవల్​ వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అక్కడే 50-ఈఎంఏ కూడా ఉంది. అది దాటితే అప్​ట్రెండ్​ కనిపించవచ్చు. 23,200 జోన్​ వద్ద బలమైన సపోర్ట్​ ఉంది,” అని ప్రభుదాస్ లిల్లధేర్​కి చెందిన వైస్​ ప్రెసిడెంట్- టెక్నికల్ రీసెర్చ్ వైషాలీ పరేఖ్​ అభిప్రాయపడ్డారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.21 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.74శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.89 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

చమురు ధర..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్​ క్రూడ్ దాదాపు 0.7శాతం పడి బ్యారెల్​కి 95.4 డాలర్లకు చేరింది.

స్టాక్స్ టు బై..

పీఎన్​బీ- బై రూ. 105, స్టాప్​ లాస్​ రూ. 102, టార్గెట్​ రూ. 110

ఓస్వాల్ పంప్స్- బై రూ. 373, స్టాప్​ లాస్​ రూ. 360, టార్గెట్​ రూ. 385

జేకే టైర్- బై రూ. 387, స్టాప్​ లాస్​ రూ. 378, టార్గెట్​ రూ. 405

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

సంధర్ టెక్నాలజీస్- బై రూ. 718, స్టాప్​ లాస్​ రూ. 685, టార్గెట్​ రూ. 770

జిందాల్ సా- బై రూ. 250, స్టాప్​ లాస్​ రూ. 237, టార్గెట్​ రూ. 270

టీడీ పవర్​ సిస్టెమ్స్- బై రూ. 1286, స్టాప్​ లాస్​ రూ. 1222, టార్గెట్​ రూ. 1390

ఫెడరల్ బ్యాంక్- బై రూ. 301, స్టాప్​ లాస్​ రూ. 289, టార్గెట్​ రూ. 322

ఎయిరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్- బై రూ. 434, స్టాప్ లాస్ రూ. 413 టార్గెట్​ రూ. 465

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More