సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 521 పాయింట్లు పెరిగి 78,285 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 159 పాయింట్లు వృద్ధిచెంది 24,430 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 353 పాయింట్లు పెరిగి 58,291 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 243.03 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,791.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.29 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.72శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.12 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ముడి చమురు ధర స్వల్పంగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ 0.39శాత పెరిగి బ్యారెల్‌కి 72.29 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ర్యాలీస్ ఇండియా- బై రూ. 227, స్టాప్ లాస్ రూ. 222, టార్గెట్ రూ. 235
{{/usCountry}}ర్యాలీస్ ఇండియా- బై రూ. 227, స్టాప్ లాస్ రూ. 222, టార్గెట్ రూ. 235
{{/usCountry}}హ్యుందాయ్ ఇండియా- బై రూ. 2000, స్టాప్ లాస్ రూ. 1940, టార్గెట్ రూ. 2100
కేన్స్ టెక్నాలజీ ఇండియా- బై రూ. 3357, స్టాప్ లాస్ రూ. 3280, టార్గెట్ రూ. 3500
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
రెయిన్ ఇండస్ట్రీస్- బై రూ. 197, స్టాప్ లాస్ రూ. 185, టార్గెట్ రూ. 220
మెట్రోపొలిస్ హెల్త్‌కేర్- బై రూ. 574, స్టాప్ లాస్ రూ. 548, టార్గెట్ రూ. 625
యునైటెడ్ స్పిరిట్స్- బై రూ. 1428, స్టాప్ లాస్ రూ. 1365, టార్గెట్ రూ. 1550
స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్స్- బై రూ. 310, స్టాప్ లాస్ రూ. 296, టార్గెట్ రూ. 340
ఎల్ అండ్ టీ ఫైనాన్స్- బై రూ. 335, స్టాప్ లాస్ రూ. 320, టార్గెట్ రూ. 365