Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈరోజు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్..
అక్టోబర్ 27,2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, ముడి చమురు ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 483 పాయింట్లు పెరిగి 73,607 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 153 పాయింట్లు వృద్ధిచెంది 22,753 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 79 పాయింట్లు పెరిగి 54,367 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,462.49 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,609.57 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 110 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీకి 22,300- 22,400 జోన్ వద్ద కీలక సపోర్ట్ ఉంది. ఇంచుమించు ఇదే జోన్లో 50 ఎస్ఎంఏ కూడా ఉంది. 22,800 జోన్ వద్ద ఉన్న రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సూచీ మరింత పెరగొచ్చు. అప్పటివరకు ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ ఎనలిస్ట్ వాత్సల్ భువ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.2 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.7శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.8 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర భగభగలాడుతోంది. బ్రెంట్ క్రూడ్ 1.06శాతం పడి బ్యారెల్‌కు 114.5 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
స్టాక్స్ టు బై..
లారస్ ల్యాబ్స్- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 1990, టార్గెట్ రూ. 2180,
ఎంసీఎక్స్- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 3020, టార్గెట్ రూ. 3300
కొఫోర్జ్- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 1930, టార్గెట్ రూ. 2120
సెయిలైఫ్- బై రూ. 1450, స్టాప్ లాస్ రూ. 1380, టార్గెట్ రూ. 1575
ఏసీఈ- బై రూ. 1020, స్టాప్ లాస్ రూ. 978, టార్గెట్ రూ. 1135
ఎల్ అండ్ టీ- బై రూ. 3700, స్టాప్ లాస్ రూ. 3575, టార్గెట్ రూ. 4010
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


