Stock market : బాబోయ్ 'క్రూడ్'! భగభగలాడుతున్న చమురు ధర- ఈరోజు స్టాక్ మార్కెట్ డౌన్?
అక్టోబర్ 26, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, ముడి చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 126 పాయింట్లు పడి 73,124 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 88 పాయింట్లు కోల్పోయి 22,600 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 638 పాయింట్లు పడి 54,287 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 887.65 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,235.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 75 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 22,300 వద్ద కీలక సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే సూచీ మరింత కిందకి పడిపోవచ్చు. 22,000 వరకు వెళ్లొచ్చు. ఇది కీలకమైన సైకలాజికల్ సపోర్ట్ లెవల్ కూడా! ఇక 22,850- 22,900 జోన్ వద్ద కీలక రెసిస్టెన్స ఉంది. అక్కడే 21 డీఎంఏ కూడా ఉంది. ఈ రెసిస్టెన్స్‌ని సూచీ క్రాస్ చేయనంత వరకు ట్రేడర్లు సెల్ ఆన్ రైజ్ స్ట్రాటజీని అనుసరించడం ఉత్తమం,” అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ డా. రవి సింగ్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.2 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.52శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.2 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర సలసల కాగిపోతోంది! చాలా రోజులుగా చమురు ధర 110 డాలర్ల ఎగువనే ట్రేడ్ అవుతోంది. అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ సోమవారం బ్యారెల్‌కు 114.5 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
స్టాక్స్ టు బై..
సయంట్- బై రూ. 1235, స్టాప్ లాస్ రూ. 1175, టార్గెట్ రూ. 1360
ఎటర్నల్- బై రూ. 320, స్టాప్ లాస్ రూ. 302, టార్గెట్ రూ. 350
గర్వారే హై టెక్ ఫిల్మ్స్ లిమిటెడ్- బై రూ. 6970- 7075, స్టాప్ లాస్ రూ. 6500, టార్గెట్ రూ. 8200
నజారా టెక్నాలజీస్ లిమిటెడ్ బై రూ. 402, స్టాప్ లాస్ రూ. 373, టార్గెట్ రూ. 480
నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ- బై రూ. 71.9, స్టాప్ లాస్ రూ. 68.5, టార్గెట్ రూ. 78
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్- బై రూ. 86.3, స్టాప్ లాస్ రూ. 82, టార్గెట్ రూ. 94
రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా- బై రూ. 88.25, స్టాప్ లాస్ రూ. 83.8, టార్గెట్ రూ. 96
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


