Stock market : మళ్లీ 100 డాలర్లకు చేరిన క్రూడ్- ఈరోజు స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి?
అక్టోబర్ 6,2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, ముడి చమురు ధరను ఇక్కడ తెలుసుకోండి..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 473 పాయింట్లు పెరిగి 72,382 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 134 పాయింట్లు వృద్ధిచెంది 22,556 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 263 పాయింట్లు పెరిగి 54,714 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,699.14 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,181.62 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.18 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.7శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి : Large cap stocks : 2ఏళ్లుగా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఢమాల్- వాటి ఫ్యూచర్ ఏంటి? బై ఆర్ సెల్?
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మరోసారి 100 డాలర్ల మార్క్‌ని తాకింది. బ్రెంట్ క్రూడ్ 0.38శాతం పెరిగి బ్యారెల్‌కి 100.7కి వెళ్లింది.
స్టాక్స్ టు బై..
ఆజాద్ ఇంజనీరింగ్- బై రూ. 2927, స్టాప్ లాస్ రూ. 2660, టార్గెట్ రూ. 3280- రూ. 3350
కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్- బై రూ. 2244, స్టాప్ లాస్ రూ. 20205, టార్గెట్ రూ. 2520- రూ. 2650
ఆదిత్య ఇన్ఫోటెక్- బై రూ. 3990, స్టాప్ లాస్ రూ. 3592, టార్గెట్ రూ. 4400- రూ. 4480
థైరోకేర్ టెక్నాలజీస్- బై రూ. 542, స్టాప్ లాస్ రూ. 515, టార్గెట్ రూ. 600
కార్బొరండమ్ యూనివర్సల్- బై రూ. 1267, స్టాప్ లాస్ రూ. 1200, టార్గెట్ రూ. 1400
మిశ్రా ధాతు నిగమ్- బై రూ. 440, స్టాప్ లాస్ రూ. 420, టార్గెట్ రూ. 475
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


