గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1045 పాయింట్లు పడి 71,593 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 371 పాయింట్లు కోల్పోయి 22,232 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 540 పాయింట్లు పడి 54,515 వద్దకు చేరింది.

అమెరికా- ఇరాన్ యుద్ధం, చమురు ధరలు పెరగడం, రూపాయి పతనం, ఇండియాలో ఏఐపై పురొగతి లేకపోవడం వంటి అంశాలు మార్కెట్లను కిందకు పడేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 12,943.58 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,703.11 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 115 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.5 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.55శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.2 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 100 డాలర్ల ఎగువనే కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.9శాతం పడి బ్యారెల్‌కు 103.3 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 100 డాలర్ల ఎగువనే కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.9శాతం పడి బ్యారెల్‌కు 103.3 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}హెక్సావేర్ టెక్నాలజీస్- బై రూ. 512, స్టాప్ లాస్ రూ. 490, టార్గెట్ రూ. 560
స్కై గోల్డ్- బై రూ. 885, స్టాప్ లాస్ రూ. 843, టార్గెట్ రూ. 970
బర్జర్ పెయింట్స్- బై రూ. 468, స్టాప్ లాస్ రూ. 445, టార్గెట్ రూ. 515
మాస్టెక్- బై రూ. 1651, స్టాప్ లాస్ రూ. 1570, టార్గెట్ రూ. 1810
ఫిజిక్స్‌వాలా- బై రూ. 141, స్టాప్ లాస్ రూ. 134, టార్గెట్ రూ. 155