Stock market : 100 డాలర్లు దాటిన చమురు ధర- ఈరోజు స్టాక్ మార్కెట్​కు నష్టాలు తప్పవా?

అక్టోబర్ 8, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​, చమురు ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 8, 2026, 08:16:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 429 పాయింట్లు పడి 72,639 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 173 పాయింట్లు కోల్పోయి 22,603 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 73 పాయింట్లు పడి 55,056 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 6,121.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,596.57 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50లో రివర్సల్​కి సంకేతాలు కనిపిస్తున్నాయి. రానున్న కొన్ని రోజులు చాలా కీలకం. 22,600 లెవల్​ కన్నా దిగువకు పడితే సూచీపై బేర్ల పట్టు పెరగొచ్చు. అదే జరిగితే నిఫ్టీ50 22,200 వరకు వెళుతుంది. అయితే, 22,750 దాటితే మాత్రం సూచీలో బుల్లిష్​ రన్ కనిపించవచ్చు,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.66 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.22శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.21 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర మరోసారి 100 డాలర్లు దాటింది. బ్రెంట్ క్రూడ్ 1.6శాతం పెరిగి బ్యారెల్​కు 101.8 డాలర్లకు పెరిగింది.

స్టాక్స్​ టు బై..

AEGISLOG: బై రూ. 1465, స్టాప్ లాస్ రూ. 1380, టార్గెట్ రూ. 1600

CLEANMAX: బై రూ. 1390, స్టాప్ లాస్ రూ. 1320, టార్గెట్ రూ. 1525

LGEINDIA: బై రూ. 1785, స్టాప్ లాస్ రూ. 1690, టార్గెట్ రూ. 1950

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More