Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్!

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్, ముడి చమురు ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 9, 2026, 08:15:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ ఏకంగా 1045 పాయింట్లు పడి 71,593 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 371 పాయింట్లు కోల్పోయి 22,232 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 540 పాయింట్లు పడి 54,515 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

అమెరికా- ఇరాన్ యుద్ధం, చమురు ధరలు పెరగడం, రూపాయి పతనం, ఇండియాలో ఏఐపై పురొగతి లేకపోవడం వంటి అంశాలు మార్కెట్లను కిందకు పడేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 12,943.58 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,703.11 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 115 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.5 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.55శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.2 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర 100 డాలర్ల ఎగువనే కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.9శాతం పడి బ్యారెల్​కు 103.3 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

హెక్సావేర్ టెక్నాలజీస్- బై రూ. 512, స్టాప్​ లాస్​ రూ. 490, టార్గెట్​ రూ. 560

స్కై గోల్డ్- బై రూ. 885, స్టాప్​ లాస్​ రూ. 843, టార్గెట్​ రూ. 970

బర్జర్ పెయింట్స్- బై రూ. 468, స్టాప్​ లాస్​ రూ. 445, టార్గెట్​ రూ. 515

మాస్టెక్- బై రూ. 1651, స్టాప్​ లాస్​ రూ. 1570, టార్గెట్​ రూ. 1810

ఫిజిక్స్​వాలా- బై రూ. 141, స్టాప్​ లాస్​ రూ. 134, టార్గెట్​ రూ. 155

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More