ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1097 పాయింట్లు పడి 78,919 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 315 పాయింట్లు కోల్పోయి 24,450 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1273 పాయింట్లు పడి 57,783 వద్దకు చేరింది.

కాగా అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఫలితంగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు ఢమాల్ అన్నాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపైనా పడనుంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 6,030.38 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,971.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ అతి భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 725 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.95 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.33 శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.59 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో అతి నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ 6.2శాతం క్రాష్ అయ్యింది. సౌత్ కొరియా కాస్పీ 6.68శాతం మేర డౌన్ అయ్యింది.
ముడి చమురు ధరలు..
పశ్చిమాసియాలో అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో 2022 ఫిబ్రవరి అనంతరం తొలిసారి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటింది.
{{/usCountry}}పశ్చిమాసియాలో అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో 2022 ఫిబ్రవరి అనంతరం తొలిసారి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటింది.
{{/usCountry}}బ్రెంట్ క్రూడ్ 17.8 శాతం పెరిగి బ్యారెల్‌కి 109.19 డాలర్ల వద్ద కొనసాగుతోంది. కొన్ని గంటల ముందు ఇది 110 డాలర్లను సైతం తాకింది.
బంగారం- వెండి ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పడ్డాయి. స్పాట్ గోల్డ్ 2.5శాతం పడి ఔన్సుకు 5041.89 డాలర్లకు చేరింది. స్పాట్ సిల్వర్ 2.1శాతం పతనమై ఔన్సుకు 80.99 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ- బై రూ. 924, స్టాప్ లాస్ రూ. 880, టార్గెట్‌రూ. 980
ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్- బై రూ. 672, స్టాప్ లాస్ రూ. 648, టార్గెట్ రూ. 714
సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్- బై రూ. 715, స్టాప్ లాస్ రూ. 693, టార్గెట్ రూ. 768
ఆస్ట్రల్- బై రూ. 1689, స్టాప్ లాస్ రూ. 1620, టార్గెట్ రూ. 1800
కిమ్స్- బై రూ. 720, స్టాప్ లాస్ రూ. 690, టార్గెట్ రూ. 772