Stock market : ట్రేడర్లకు పీడకల లోడింగ్? గిఫ్ట్​ నిఫ్టీ 700 పాయింట్లు డౌన్​! మార్కెట్లలో రక్తపాతం..

Gift nifty live today : మార్చ్​ 9 2026, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 9, 2026, 08:15:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇరాన్​- ఇజ్రాయెల్​, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1097 పాయింట్లు పడి 78,919 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 315 పాయింట్లు కోల్పోయి 24,450 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1273 పాయింట్లు పడి 57,783 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

కాగా అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఫలితంగా అంతర్జాతీయ స్టాక్​ మార్కెట్​లు ఢమాల్​ అన్నాయి. ఈ ప్రభావం దేశీయ స్టాక్​ మార్కెట్​లపైనా పడనుంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 6,030.38 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,971.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్ అతి భారీ​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 725 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.95 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 1.33 శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.59 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అతి నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్​ నిక్కీ 6.2శాతం క్రాష్​ అయ్యింది. సౌత్​ కొరియా కాస్పీ 6.68శాతం మేర డౌన్​ అయ్యింది.

ముడి చమురు ధరలు..

పశ్చిమాసియాలో అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో 2022 ఫిబ్రవరి అనంతరం తొలిసారి బ్రెంట్​ క్రూడ్​ ధర బ్యారెల్​కు 100 డాలర్లను దాటింది.

బ్రెంట్​ క్రూడ్​ 17.8 శాతం పెరిగి బ్యారెల్​కి 109.19 డాలర్ల వద్ద కొనసాగుతోంది. కొన్ని గంటల ముందు ఇది 110 డాలర్లను సైతం తాకింది.

బంగారం- వెండి ధరలు..

అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం, వెండి ధరలు పడ్డాయి. స్పాట్​ గోల్డ్​ 2.5శాతం పడి ఔన్సుకు 5041.89 డాలర్లకు చేరింది. స్పాట్​ సిల్వర్​ 2.1శాతం పతనమై ఔన్సుకు 80.99 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఆదిత్య బిర్లా సన్​ లైఫ్​ ఏఎంసీ- బై రూ. 924, స్టాప్​ లాస్​ రూ. 880, టార్గెట్​రూ. 980

ఆస్టర్​ డీఎం హెల్త్​కేర్​- బై రూ. 672, స్టాప్​ లాస్​ రూ. 648, టార్గెట్​ రూ. 714

సీజీ పవర్​ అండ్​ ఇండస్ట్రియల్​ సొల్యూషన్స్​- బై రూ. 715, స్టాప్​ లాస్​ రూ. 693, టార్గెట్​ రూ. 768

ఆస్ట్రల్​- బై రూ. 1689, స్టాప్​ లాస్​ రూ. 1620, టార్గెట్​ రూ. 1800

కిమ్స్​- బై రూ. 720, స్టాప్​ లాస్​ రూ. 690, టార్గెట్​ రూ. 772

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More