LIC share price : ట్రేడర్స్ అలర్ట్- ఎల్ఐసీ షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే!
Stocks to buy today : జులై 1, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 250 పాయింట్లు పడి 76,479 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 81 పాయింట్లు కోల్పోయి 23,866 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 184 పాయింట్లు పడి 57,543 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,556.75 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,842.34 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 16 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీకి 23,800 దగ్గర కీలక సపోర్ట్, 24,350 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనే సూచీ పెరగొచ్చు,” అని ప్రభుదాస్ లిల్లధేర్కి చెందిన వైస్ ప్రెసిడెంట్, టెక్నికల్ రీసెర్చ్ వైశాలీ పరేఖ్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.26 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.79శాతం లాభపడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.52 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
అమెరికా- ఇరాన్ చర్చల అనిశ్చితి నేపథ్యంలో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 0.69శాతం పెరిగి బ్యారెల్‌కి 73.45 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ఫెడరల్ బ్యాంక్- బై రూ. 330, స్టాప్ లాస్ రూ. 318, టార్గెట్ రూ. 354
ఇప్కా లేబరేటరీస్- బై రూ. 1701, స్టాప్ లాస్ రూ .1640, టార్గెట్ రూ. 1820
ఎల్ఐసీ- బై రూ. 432, స్టాప్ లాస్ రూ. 422, టార్గెట్ రూ. 452
హెచ్ఎఫ్సీఎల్- బై రూ. 212, స్టాప్ లాస్ రూ. 205, టార్గెట్ రూ. 222
సెయిల్- బై రూ. 174, స్టాప్ లాస్ రూ. 166, టార్గెట్ రూ. 188
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
కాప్రీ గ్లోబల్ క్యాపిటల్- బై రూ. 228, స్టాప్ లాస్ రూ. 216, టార్గెట్ రూ. 250
గ్రీవ్స్ కాటన్- బై రూ. 220, స్టాప్ లాస్ రూ. 200, టార్గెట్ రూ. 240
సుప్రియ లైఫ్‌సైన్సెస్- బై రూ. 1018, స్టాప్ లాస్ రూ. 960, టార్గెట్ రూ. 1130
వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్- బై రూ. 601, స్టాప్ లాస్ రూ. 573, టార్గెట్ రూ. 655
ఆప్టుస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా- బై రూ. 279, స్టాప్ లాస్ రూ. 265, టార్గెట్ రూ. 305
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


