సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 548 పాయింట్లు పడి 71,925 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 157 పాయింట్లు కోల్పోయి 22,363 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 339 పాయింట్లు పడి 54,918 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,708.48 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,045.02 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.3 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.05శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.4 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారంవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 100 డాలర్ల ఎగువనే కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ మంగళవారం 1.2శాతం పడి బ్యారెల్కు 105.5 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
స్టాక్స్ టు బై..
నెట్వెబ్ టెక్నాలజీస్- బై రూ. 4989, స్టాప్ లాస్ రూ. 4550, టార్గెట్ రూ. 5500
సన్సెరా ఇంజనీరింగ్- బై రూ. 4226, స్టాప్ లాస్ రూ. 3860, టార్గెట్ రూ. 4660- 4750
{{/usCountry}}సన్సెరా ఇంజనీరింగ్- బై రూ. 4226, స్టాప్ లాస్ రూ. 3860, టార్గెట్ రూ. 4660- 4750
{{/usCountry}}గ్లాండ్ ఫార్మా- బై రూ. 3088, స్టాప్ లాస్ రూ. 2860, టార్గెట్ రూ. 3400- 3500
సంవర్థన మథర్సన్ ఇంటర్నేషనల్- బై రూ. 157, స్టాప్ లాస్ రూ. 149, టార్గెట్ రూ. 170
హెచ్ఏఎల్- బై రూ. 4760, స్టాప్ లాస్ రూ. 4500, టార్గెట్ రూ. 5250
సౌత్ ఇండియన్ బ్యాంక్- బై రూ. 49, స్టాప్ లాస్ రూ. 46, టార్గెట్ రూ. 55