Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 183 స్టాక్​తో లాభాలకు ఛాన్స్..

అక్టోబర్ 15, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 15, 2026, 08:18:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 252 పాయింట్లు పడి 72,782 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 99 పాయింట్లు కోల్పోయి 22,623 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 165 పాయింట్లు పడి 55,316 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,857.44 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,670.44 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ ఫ్లాట్​గా క్లోజ్ అయ్యింది. ఎస్​ అండ్​ పీ 500​ 1శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 2 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర 100 డాలర్ల ఎగువనే కొనసాగుతోంది. గురువారం ట్రేడింగ్​లో బ్రెంట్ క్రూడ్ 1.6శాతం పడి బ్యారెల్​కు 10.4 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

జిందాల్ సా లిమిటెడ్- బై రూ. 297, స్టాప్​ లాస్​ రూ. 280, టార్గెట్​ రూ. 342

శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ- బై రూ. 1141, స్టాప్​ లాస్​ రూ. 1070, టార్గెట్​ రూ. 1290

ఐసీఐసీఐజీఐ- బై రూ. 1720, స్టాప్​ లాస్​ రూ. 1650, టార్గెట్​ రూ. 1910

బీహెచ్​ఈఎల్- బై రూ. 466, స్టాప్​ లాస్​ రూ. 439, టార్గెట్​ రూ. 510

ఫస్ట్ క్రై- బై రూ. 183, స్టాప్​ లాస్​ రూ. 175, టార్గెట్​ రూ. 201

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More