Stock market : 105 డాలర్ల ఎగువకు క్రూడ్ ఆయిల్- ఈరోజు స్టాక్ మార్కెట్​కు నష్టాలు?

అక్టోబర్ 14, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్, ముడి చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 14, 2026, 08:15:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మంగళరం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 11096 పాయింట్లు పెరిగి 73,034 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 359 పాయింట్లు వృద్ధిచెంది 22,722 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 563 పాయింట్లు పెరిగి 55,481 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,305.13 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,439.24 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 85 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“ఆగస్ట్ 25 2026 తర్వాత తొలిసారి నిఫ్టీ50 13-డే ఈఎంఐ ఎగువన క్లోజ్ అయ్యింది. ఇది కాస్త సానుకూల అంశం. సూచీలో ప్రస్తుతం హయ్యర్ టాప్, హయ్యర్ బాటమ్ చార్ట్​ పాటర్న్ ఏర్పడుతోంది. ఇది షార్ట్​ టర్మ్ బుల్లిష్ రివర్సల్​కి సంకేతం. 23,100- 23,150 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్ అయితే సూచీ మరింత పైకి వెళ్లొచ్చు. 22,580 వద్ద సపోర్ట్ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూటిరీస్​కి చెందిన డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ నదీష్ షా తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.30 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.1శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.2 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప లభాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర మరింత పెరిగింది. బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో బ్రెంట్ క్రూడ్ 1శాతం పెరిగి బ్యారెల్​కు 106.7 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

ఈక్లెర్క్స్ సర్వీసెస్ లిమిటెడ్- బై రూ. 1941- రూ. 1971, స్టాప్​ లాస్​ రూ. 1850, టార్గెట్​ రూ. 2280

కొఫోర్జ్- బై రూ. 1910- రూ. 1939, స్టాప్​ లాస్​ రూ. 1830, టార్గెట్​ రూ. 2200

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More