Stock market : ట్రేడర్స్ అలర్ట్- Nykaa, LIC షేర్ ప్రైజ్ టార్గెట్స్ ఇవే..
అక్టోబర్ 12, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 879 పాయింట్లు పెరిగి 72,472 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 289 పాయింట్లు వృద్ధిచెంది 22,520 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 742 పాయింట్లు పెరిగి 55,257 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,568.90 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,743.26 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 22,800, 23,100 లెవల్స్ కీలక రెసిస్టెన్స్‌గా ఉన్నాయి. ఇవి బ్రేక్ అయితే సూచీ రికవరీ అవుతున్నట్టు. ఇక 22,000- 22,180 జోన్ కీలక సపోర్ట్‌గా ఉంది. ఇది బ్రేక్ అయితే అమ్మకాల ఒత్తిడి మరింత పెరగొచ్చు,” అని చాయిస్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎనలిస్ట్ హితేశ్ టైలర్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.83 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.59శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.64 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ముడి చమురు ధర పడింది. బ్రెంట్ క్రూడ్ 1.6శాతం పడి బ్యారెల్‌కు 103 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
స్టాక్స్ టు బై..
ఆర్బీఎల్ బ్యాంక్- బై రూ. 418, స్టాప్ లాస్ రూ. 400, టార్గెట్ రూ. 452
బిర్లాసాఫ్ట్- బై రూ. 286, స్టాప్ లాస్ రూ. 272, టార్గెట్ రూ .315
గో డిజిట్- బై రూ. 273, స్టాప్ లాస్ రూ. 260, టార్గెట్ రూ. 300
ఎల్ఐసీ- బై రూ. 394, స్టాప్ లాస్ రూ. 375, టార్గెట్ రూ. 430
నైకా- బై రూ. 343, స్టాప్ లాస్ రూ. 324, టార్గెట్ రూ. 375
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


