Stock market : ట్రేడర్స్ అలర్ట్- నేటి బ్రేకౌట్​ స్టాక్స్ టు బై లిస్ట్ ఇదే..

అక్టోబర్​ 1, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్, ముడి చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 1, 2026, 09:01:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 49 పాయింట్లు పడి 72,480 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 96 పాయింట్లు కోల్పోయి 22,620 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 373 పాయింట్లు పెరిగి 54,633 వద్దకు చేరింది.

లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 10,148.41 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 11,271.73 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.85 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.25శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.2 శాతం డౌన్​ పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర స్వల్పంగా దిగొచ్చింది. బ్రెంట్ క్రూడ్ ధర 0.34శాతం పడి బ్యారెల్​కి 97.7 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

పీవీఆర్ ఐనాక్స్- బై రూ. 1243, స్టాప్​ లాస్​ రూ. 1180, టార్గెట్​ రూ. 1370

జేకే టైర్- బై రూ. 347, స్టాప్​ లాస్​ రూ. 330, టార్గెట్​ రూ. 380

ఐసీఐసీఐ లంబార్డ్- బై రూ. 1590, స్టాప్​ లాస్​ రూ. 1510, టార్గెట్​ రూ. 1750

టెక్స్​మాకో రెయిల్- బై రూ. 131, స్టాప్​ లాస్​ రూ. 125, టార్గెట్​ రూ. 145

మిశ్రా ధాతు- బై రూ. 437, స్టాప్​ లాస్​ రూ. 416, టార్గెట్​ రూ. 480

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More