గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 238 పాయింట్లు పెరిగి 76,742 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 81 పాయింట్లు వృద్ధిచెంది 23,963 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 510 పాయింట్లు పెరిగి 57,253 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 532.86 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,057.79 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 105 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 కన్సాలిడేషన్ దశకు చేరుకుంది. సూచీకి 23,650- 23,800 జోన్ కీలక సపోర్ట్‌గా ఉంది. 24,150- 24,400 జోన్ రెసిస్టెన్స్‌గా ఉంది. రిస్క్ మేనేజ్మెంట్కి కట్టుబడి ఈ సమయంలో ఫార్మా, రియాల్టీ వంటి బలమైన సెక్టార్స్‌పై ఫోకస్ చేయడం ఉత్తమం,” అని రెలిగేర్ బ్రోకింగ్‌కి చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.27 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.81శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.30 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}అమెరికా- ఇరాన్ యుద్ధ భయాలు తగ్గడంతో చమురు ధర సైతం పతనమవుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.09శాతం తగ్గి బ్యారెల్‌కి 76.23 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
గ్రాన్యూల్స్ ఇండియా- బై రూ. 882, స్టాప్ లాస్ రూ. 850, టార్గెట్ రూ. 946
జిందాల్ సా- బై రూ. 272.3, స్టాప్ లాస్ రూ. 266, టార్గెట్ రూ. 294
సీడీఎస్ఎల్- బై రూ. 1348, స్టాప్ లాస్ రూ. 1320, టార్గెట్ రూ. 1400
ఇండియన్ బ్యాంక్- బై రూ. 793, స్టాప్ లాస్ రూ. 780, టార్గెట్ రూ. 810
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- బై రూ. 62.58, స్టాప్ లాస్ రూ. 59.20, టార్గెట్ రూ. 68
బజాజా కన్జ్యూమర్ కేర్- బై రూ. 643, స్టాప్ లాస్ రూ. 610, టార్గెట్ రూ. 700
సిల్ప మెడికేర్- బై రూ. 622, స్టాప్ లాస్ రూ. 588, టార్గెట్ రూ. 677
అనంత్ రాజ్- బై రూ. 569, స్టాప్ లాస్ రూ. 536, టార్గెట్ రూ. 615
మనోరమ ఇండస్ట్రీస్- బై రూ. 1579, స్టాప్ లాస్ రూ. 1500, టార్గెట్ రూ. 1700