Stock market : చమురు ధర @101 డాలర్లు- స్టాక్ మార్కెట్​కు నష్టాలు తప్పవా?

సెప్టెంబర్ 10, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Sep 10, 2026, 08:15:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 813 పాయింట్లు పడి 74,764 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 204 పాయింట్లు కోల్పోయి 23,431 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 482 పాయింట్లు పడి 56,296 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..

అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితుల కారణంగా ముడి చమురు ధర భగ్గుమంది. ఫలితంగా ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు ఒత్తిడికి గురవుతున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 582.99 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1509.04 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.77 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.48శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.64 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావం చమురు ధరపై భారీగా పడుతోంది. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్​కు 101.34 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

సాయి లైఫ్​ సైన్సెస్- బై రూ. 1675, స్టాప్​ లాస్​ రూ. 1618, టార్గెట్​ రూ. 1795

ఫినోలెక్స్ కేబుల్స్- బై రూ. 1353, స్టాప్​ లాస్​ రూ. 1307, టార్గెట్​ రూ. 1450

బీహెచ్​ఈఎల్- బై రూ. 433, స్టాప్​ లాస్​ రూ. 426, టార్గెట్​ రూ. 445

వేదాంత- బై రూ. 273, స్టాప్​ లాస్​ రూ. 266, టార్గెట్​ రూ. 282

ఆల్కెం లాబోరేటరీస్- బై రూ. 5140, స్టాప్​ లాస్​ రూ. 5050, టార్గెట్​ రూ. 5300

బ్రేకౌట్ స్టాక్స్ టు బై..

వన్ 97 కమ్యూనికేషన్స్- బై రూ. 1751, స్టాప్​ లాస్​ రూ. 1690, టార్గెట్​ రూ. 1875

గ్లోబల్ హెల్త్ (మేదాంత)- బై రూ. 1480, స్టాప్​ లాస్​ రూ. 1428, టార్గెట్​ రూ. 1585

అదానీ పవర్- బై రూ. 215, స్టాప్​ లాస్​ రూ. 207, టార్గెట్​ రూ. 230

జేఎస్​డబ్ల్యూ ఇన్​ఫ్రా- బై రూ. 341.4, స్టాప్​ లాస్​ రూ. 330, టార్గెట్​ రూ. 365

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ- బై రూ. 1066, స్టాప్​ లాస్​ రూ. 1030, టార్గెట్​ రూ. 1140

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More