...
...
Next Story

Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 82 స్టాక్​తో లాభాలకు ఛాన్స్!

నవంబర్ 12, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్, ముడి చమురు ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 12, 2026, 08:15:01 IST
Advertisement

దేశీయ స్టాక్ మార్కెట్​లో లాభాల పరంపర కొనసాగుతోంది. బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ప్రాఫిట్స్​లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 773 పాయింట్లు పెరిగి 81,880 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 210 పాయింట్లు వృద్ధిచెంది 25,255 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1015 పాయింట్లు పెరిగి 60,792 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 12,563.33 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,434.53 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 12 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 సూచీ ఓవర్​బాట్ జోన్​లో ఉంది. ఫలితంగా 25,000- 24,800 లెవల్స్​కి రిట్రేస్​ అవ్వొచ్చు! ఇది సపోర్ట్​గాను, 25,500 జోన్ రెసిస్టెన్స్​గాను ఉన్నాయి. కానీ మొత్తం మీద చూసుకుంటే నిఫ్టీ50లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. ఏదైనా కరెక్షన్ వస్తే కొనుగోళ్లకు మంచి అవకాశంగా పరిగణించాలి,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ వత్సల్ భువ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.49 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.3శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.6 శాతం పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర ఫ్లాట్​గా ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.6శాతం పడి బ్యారెల్​కు 92.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

స్టాక్స్​ టు బై..

ఆర్​కే ఫోర్జ్- బై రూ. 765, స్టాప్​ లాస్​ రూ. 725, టార్గెట్​ రూ. 840

ఆర్తీ ఇండ్- బై రూ. 485, స్టాప్​ లాస్​ రూ. 460, టార్గెట్​ రూ. 525

ఏబీఎల్​బీఎల్- బై రూ. 81.8, స్టాప్​ లాస్​ రూ. 78, టార్గెట్​ రూ. 88

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks