Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 82 స్టాక్‌తో లాభాలకు ఛాన్స్!
నవంబర్ 12, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, ముడి చమురు ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర కొనసాగుతోంది. బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రాఫిట్స్‌లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 773 పాయింట్లు పెరిగి 81,880 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 210 పాయింట్లు వృద్ధిచెంది 25,255 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1015 పాయింట్లు పెరిగి 60,792 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 12,563.33 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,434.53 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 12 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 సూచీ ఓవర్‌బాట్ జోన్లో ఉంది. ఫలితంగా 25,000- 24,800 లెవల్స్‌కి రిట్రేస్ అవ్వొచ్చు! ఇది సపోర్ట్గాను, 25,500 జోన్ రెసిస్టెన్స్గాను ఉన్నాయి. కానీ మొత్తం మీద చూసుకుంటే నిఫ్టీ50లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. ఏదైనా కరెక్షన్ వస్తే కొనుగోళ్లకు మంచి అవకాశంగా పరిగణించాలి,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ వత్సల్ భువ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.49 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.3శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.6 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ప్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.6శాతం పడి బ్యారెల్‌కు 92.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
స్టాక్స్ టు బై..
ఆర్కే ఫోర్జ్- బై రూ. 765, స్టాప్ లాస్ రూ. 725, టార్గెట్ రూ. 840
ఆర్తీ ఇండ్- బై రూ. 485, స్టాప్ లాస్ రూ. 460, టార్గెట్ రూ. 525
ఏబీఎల్బీఎల్- బై రూ. 81.8, స్టాప్ లాస్ రూ. 78, టార్గెట్ రూ. 88
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


