మంగళరం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 11096 పాయింట్లు పెరిగి 73,034 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 359 పాయింట్లు వృద్ధిచెంది 22,722 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 563 పాయింట్లు పెరిగి 55,481 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,305.13 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,439.24 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 85 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“ఆగస్ట్ 25 2026 తర్వాత తొలిసారి నిఫ్టీ50 13-డే ఈఎంఐ ఎగువన క్లోజ్ అయ్యింది. ఇది కాస్త సానుకూల అంశం. సూచీలో ప్రస్తుతం హయ్యర్ టాప్, హయ్యర్ బాటమ్ చార్ట్ పాటర్న్ ఏర్పడుతోంది. ఇది షార్ట్ టర్మ్ బుల్లిష్ రివర్సల్కి సంకేతం. 23,100- 23,150 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్ అయితే సూచీ మరింత పైకి వెళ్లొచ్చు. 22,580 వద్ద సపోర్ట్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూటిరీస్కి చెందిన డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ నదీష్ షా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.30 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.1శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.2 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మరింత పెరిగింది. బుధవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 1శాతం పెరిగి బ్యారెల్కు 106.7 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ఈక్లెర్క్స్ సర్వీసెస్ లిమిటెడ్- బై రూ. 1941- రూ. 1971, స్టాప్ లాస్ రూ. 1850, టార్గెట్ రూ. 2280
కొఫోర్జ్- బై రూ. 1910- రూ. 1939, స్టాప్ లాస్ రూ. 1830, టార్గెట్ రూ. 2200