గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1532 పాయింట్లు పెరిగి 74,316 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 375 పాయింట్లు వృద్ధిచెంది 22,998 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 494 పాయింట్లు పెరిగి 55,810 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5,285.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,319.39 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 120 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 23,180 వద్ద 38.2శాతం ఫిబనోచీ రిట్రేస్మెంట్ ఉంది. అది దాటితే సూచీ మరింత పెరగొచ్చి. కానీ నిఫ్టీ50 50డీఎంఏ, 200డీఎంఏ కిందే ట్రేడ్ అవుతోంది. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి. 50డీఎంఏ దాటితేనే సూచీలో మరింత పరుగు కనిపించవచ్చు. నిఫ్టీ50కి 22,800 వద్ద కీలక సపోర్ట్ ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్కి చెందిన వత్సల్ భువ చెప్పారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.08 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.33శాతం జంప్ అయ్యింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ ఫ్లాట్గా ముగిసింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 100 డాలర్ల ఎగువనే కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ ధర 0.32శాతం పడి బ్యారెల్కు 105.5 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
హెచ్సీఎల్ టెక్- బై రూ.1365, స్టాప్ లాస్ రూ. 1290, టార్గెట్ రూ. 1495
ఆనంద్రతి- బై రూ. 2150, స్టాప్ లాస్ రూ. 2060, టార్గెట్ రూ. 2350
సుప్రీమైండ్- బై రూ. 3620, స్టాప్ లాస్ రూ. 3490, టార్గెట్ రూ. 3960