Stock market : ట్రేడర్స్ అలర్ట్- హెచ్‌సీఎల్ టెక్ స్టాక్‌తో లాభాలకు ఛాన్స్- షేర్ ప్రైజ్ టార్గెట్..
అక్టోబర్ 16, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1532 పాయింట్లు పెరిగి 74,316 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 375 పాయింట్లు వృద్ధిచెంది 22,998 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 494 పాయింట్లు పెరిగి 55,810 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5,285.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,319.39 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 120 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 23,180 వద్ద 38.2శాతం ఫిబనోచీ రిట్రేస్‌మెంట్ ఉంది. అది దాటితే సూచీ మరింత పెరగొచ్చి. కానీ నిఫ్టీ50 50డీఎంఏ, 200డీఎంఏ కిందే ట్రేడ్ అవుతోంది. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి. 50డీఎంఏ దాటితేనే సూచీలో మరింత పరుగు కనిపించవచ్చు. నిఫ్టీ50కి 22,800 వద్ద కీలక సపోర్ట్ ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన వత్సల్ భువ చెప్పారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.08 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.33శాతం జంప్ అయ్యింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ ఫ్లాట్‌గా ముగిసింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 100 డాలర్ల ఎగువనే కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ ధర 0.32శాతం పడి బ్యారెల్‌కు 105.5 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
హెచ్‌సీఎల్ టెక్- బై రూ.1365, స్టాప్ లాస్ రూ. 1290, టార్గెట్ రూ. 1495
ఆనంద్రతి- బై రూ. 2150, స్టాప్ లాస్ రూ. 2060, టార్గెట్ రూ. 2350
సుప్రీమైండ్- బై రూ. 3620, స్టాప్ లాస్ రూ. 3490, టార్గెట్ రూ. 3960
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


