...
...
Next Story

Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ 3 స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్!

నవంబర్ 17, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​, ముడి చమురు ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 17, 2026, 08:16:04 IST
Advertisement

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 512 పాయింట్లు పెరిగి 82,105 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 147 పాయింట్లు వృద్ధిచెంది 25,291 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 542 పాయింట్లు పెరిగి 61,576 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో డీ​ఐఐలు రూ. 3,519.05 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో ఎఫ్ఐఐలు రూ. 4,864.68 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 3 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 25,300- 25,400 జోన్​ వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది. అది దాటిన తర్వాత సమయంలో 25,900- 26,000 జోన్ వరకు వెళ్లే అవకాశం ఉంది. 25000 మార్క్ వద్ద కీలక సపోర్ట్ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.41 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 1.9శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 2.49 శాతం డౌన్​ అయ్యింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర పడుతోంది. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో 1.05 శాతం పడి బ్యారెల్​కు 91.4 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

కిమ్స్- బై రూ. 765, స్టాప్​ లాస్​ రూ. 710, టార్గెట్​ రూ. 840

జీఎంఆర్​ ఎయిర్​పోర్ట్- బై రూ. 102, స్టాప్ లాస్​ రూ. 92, టార్గెట్​ రూ. 113

కేపీఆర్​ మిల్- బై రూ. 1215, స్టాప్​ లాస్​ రూ. 1165, టార్గెట్​ రూ. 1340

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks