బుధవారం ట్రెడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 0.45 శాతం పెరిగి 74,336.45 వద్ద, నిఫ్టీ-50 0.43 శాతం లాభపడి 23,217.60 వద్ద స్థిరపడ్డాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ 0.89శాతం పెరిగి 56,292 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,751.18 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,534.66 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
ఫెడ్ రేట్ హైక్ వేళ బుధవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.2 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.45శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.012 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
US Fed rate hike : యూఎస్ ఫెడ్ రేట్ హైక్.. భారత ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
ముడి చమురు ధర..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ముడి చమురు ధర పడింది. బ్రెంట్ క్రూడ్ 1.2శాతం పతనమై బ్యారెల్‌కు 104.5 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}గురువారం ట్రేడింగ్ సెషన్లో ముడి చమురు ధర పడింది. బ్రెంట్ క్రూడ్ 1.2శాతం పతనమై బ్యారెల్‌కు 104.5 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}హెరిటేజ్ ఫుడ్స్- బై రూ. 409, స్టాప్ లాస్ రూ. 384, టార్గెట్ రూ. 450
ఈక్లెర్క్స్ సర్వీసెస్- బై రూ. 1962, స్టాప్ లాస్ రూ. 1850, టార్గెట్ రూ. 2170
జేకే పేపర్- బై రూ. 417, స్టాప్ లాస్ రూ. 396, టార్గెట్ రూ. 460
హెచ్డీఎఫ్సీ బ్యాంక్- బై రూ. 721, స్టాప్ లాస్- రూ. 690, టార్గెట్ రూ. 780
ఏజిస్ లాజిస్ట్రిక్స్- బై రూ. 1381, స్టాప్ లాస్ రూ. 1310, టార్గెట్ రూ. 1520