Stock market : ట్రేడర్స్ అలర్ట్- నిఫ్టీ50 సపోర్ట్, రెసిస్టెన్స్ లెవల్స్, స్టాక్స్ టు బై లిస్ట్..

నవంబర్ 18, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​, ముడి చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 18, 2026, 08:20:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 4227 పాయింట్లు పెరిగి 82,532 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 96 పాయింట్లు వృద్ధిచెంది 25,387 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 697 పాయింట్లు పెరిగి 62,273 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,195.38 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 196.93 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 105 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 25,500 వద్ద కీలక రెసిస్టెన్స్​ ఉంది. అది బ్రేక్ చేసి పైకి వెళ్లలేకపోతోంది. ఇప్పటికైతే పాజిటివ్​ ట్రెండే కొనసాగుతోంది. 25,500 బ్రేక్ అయితే సూచీ 25,900- 26,000 వరకు ర్యాలీ అవ్వొచ్చు. ఇక నిఫ్టీ50కి 25,100 వద్ద కీలక సపోర్ట్ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.6 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 1.03 శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.74 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో దూసుకెళుతున్నాయి.

ముడి చమురు ధర..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో బ్రెంట్ క్రూడ్ 0.5శాతం పడి బ్యారెల్​కు 92.6 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

స్టాక్స్​ టు బై..

వెల్పన్ లివ్- బై రూ. 266, స్టాప్ లాస్ రూ. 253, టార్గెట్​ రూ. 295

డెల్హివరీ- బై రూ. 458, స్టాప్​ లాస్​ రూ. 435, టార్గెట్​ రూ. 495

ఛోలాఫిన్- బై రూ. 1888, స్టాప్​ లాస్​ రూ. 1800, టార్గెట్​ రూ. 2088

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More