భగభగలాడుతున్న ముడి చమురు ధర- ఈ రోజు స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి? ఏ స్టాక్స్​లో ట్రేడ్ చేయాలి?

అక్టోబర్ 19, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​, ముడి చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 19, 2026, 08:15:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 414 పాయింట్లు పెరిగి 74,729 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 149 పాయింట్లు వృద్ధిచెంది 23,146 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 149 పాయింట్లు పెరిగి 55,844 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,551.19 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,661.28 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 3 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 23,300 వద్ద అత్యంత కీలకమైన 50 ఈఎంఏ ఉంది. అది దాటితే సూచీ మరింత పెరగొచ్చు. 22,200 జోన్ కీలక సపోర్ట్​గా ఉంది,” అని ప్రభుదాస్ లిల్లాధేర్ వైస్ ప్రెసిడెంట్ వైశాలి పరేఖ్ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.55 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 1శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 2.1 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

ముడి చమురు ధర భగభగలాడుతోంది! సోమవారం ట్రేడింగ్ సెషన్​లో బ్రెంట్ క్రూడ్ 1.8శాతం పడి బ్యారెల్​కు 107.8 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

స్టాక్స్​ టు బై..

కొఫోర్జ్- బై రూ. 1950, స్టాప్ లాస్ రూ. 1900, టార్గెట్ రూ. 2030

లలితా జ్యువెలరీ మార్ట్- బై రూ. 371, స్టాప్​ లాస్​ రూ. 360, టార్గెట్​ రూ. 385

టైటాన్- బై రూ. 4480, స్టాప్​ లాస్​ రూ. 4400, టార్గెట్​ రూ. 4650

ఎంఫాసిస్- బై రూ. 2650, స్టాప్​ లాస్​ రూ. 2425, టార్గెట్​ రూ. 2650

హెచ్​ఏఎల్- బై సీఎంపీ, స్టాప్​ లాస్​ రూ. 4840, టార్గెట్​ రూ. 5260

ఇండియన్ హోటల్స్ కంపెనీ- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 750, టార్గెట్​ రూ. 815

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More