Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ 10 స్టాక్స్‌తో లాభాలకు ఛాన్స్!
Stocks to buy today : జులై 2, 2026- ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 444 పాయింట్లు పెరిగి 76,923 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 140 పాయింట్లు వృద్ధిచెంది 24,006 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 490 పాయింట్లు పెరిగి 58,033 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,140.50 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,159.24 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.03 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.22శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.66 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కి 72 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది.
స్టాక్స్ టు బై..
మిండా కార్పొరేషన్- బై రూ. 709, స్టాప్ లాస్ రూ. 685, టార్గెట్ రూ. 755
హొనాసా కన్జ్యూమర్- బై రూ. 466, స్టాప్ లాస్ రూ. 450, టార్గెట్ రూ. 498
బజాజా ఆటో- బై రూ. 9842, స్టాప్ లాస్ రూ. 9700, టార్గెట్ రూ .10250
బీఈఎల్- బై రూ .416, స్టాప్ లాస్ రూ. 408, టార్గెట్ రూ .428
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్- బై రూ. 1790, స్టాప్ లాస్ రూ. 1680, టార్గెట్ రూ. 1850
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
అదానీ ఎంటర్ప్రైజెస్- బై రూ. 3144, స్టాప్ లాస్ రూ. 3000, టార్గెట్ రూ .3425
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్- బై రూ. 113.50, స్టాప్ లాస్ రూ. 108, టార్గెట్ రూ. 124
కిమ్స్- బై రూ. 831, స్టాప్ లాస్ రూ. 790, టార్గెట్ రూ. 907
సీయెట్ లిమిటెడ్- బై రూ. 3635, స్టాప్ లాస్ రూ. 3450, టార్గెట్ రూ. 4000
ఏసీఎంఈ సొలార్ హోల్డింగ్స్- బై రూ. 391, స్టాప్ లాస్ రూ. 370, టార్గెట్ రూ. 430
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


