...
...
Next Story

Stock market : దిగొస్తున్న చమురు ధర- ఈరోజు స్టాక్ మార్కెట్​కి భారీ లాభాలు..!

నవంబర్ 2, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్, చమురు ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 2, 2026, 08:15:54 IST
Advertisement

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 308 పాయింట్లు పెరిగి 74,460 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 116 పాయింట్లు వృద్ధిచెంది 23,053 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 223 పాయింట్లు పడి 54,687 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,598.54 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 817.51 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 205 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 23,200 వద్ద కీలక సపోర్ట్ ఉంది. అక్కడే డైలీ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. అది బ్రేక్ అయితే సూచీ 23,700- 24,000 వరకు వెళ్లొచ్చు. ఇక 22,850 వద్ద కీలక సపోర్ట్​ ఉంది. అది బ్రేక్ అయితే 22,600- 22,400 జోన్ వరకు పడిపోవచ్చు,” అని చాయిస్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎనలిస్ట్ హితేశ్ టైలర్ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.09 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 1.82శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 2.86 శాతం డౌన్​ అయ్యింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర దిగొస్తోంది. బ్రెంట్​ క్రూడ్ గత వారం బ్యారెల్​కు 115 డాలర్లు దాటిన విషయం తెలిసిందే. ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్​లో బ్రెంట్​ క్రూడ్ 2.7శాతం పడి బ్యారెల్​కు 110.2 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

స్టాక్స్​ టు బై..

ఏథర్​ ఎనర్జీ- బై రూ. 1760, స్టాప్​ లాస్​ రూ. 1650, టార్గెట్ రూ. 1995

పీపీఎల్ ఫార్మా- బై రూ. 240, స్టాప్​ లాస్​ రూ. 229, టార్గెట్​ రూ. 265

శ్యామ్ మెటాలిక్స్- బై రూ. 1165, స్టాప్​ లాస్​ రూ. 1115, టార్గెట్​ రూ. 1285

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks