Stock market : దిగొస్తున్న చమురు ధర- ఈరోజు స్టాక్ మార్కెట్‌కి భారీ లాభాలు..!
నవంబర్ 2, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, చమురు ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 308 పాయింట్లు పెరిగి 74,460 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 116 పాయింట్లు వృద్ధిచెంది 23,053 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 223 పాయింట్లు పడి 54,687 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,598.54 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 817.51 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 205 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 23,200 వద్ద కీలక సపోర్ట్ ఉంది. అక్కడే డైలీ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. అది బ్రేక్ అయితే సూచీ 23,700- 24,000 వరకు వెళ్లొచ్చు. ఇక 22,850 వద్ద కీలక సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే 22,600- 22,400 జోన్ వరకు పడిపోవచ్చు,” అని చాయిస్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎనలిస్ట్ హితేశ్ టైలర్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.09 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.82శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.86 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర దిగొస్తోంది. బ్రెంట్ క్రూడ్ గత వారం బ్యారెల్‌కు 115 డాలర్లు దాటిన విషయం తెలిసిందే. ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 2.7శాతం పడి బ్యారెల్‌కు 110.2 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
స్టాక్స్ టు బై..
ఏథర్ ఎనర్జీ- బై రూ. 1760, స్టాప్ లాస్ రూ. 1650, టార్గెట్ రూ. 1995
పీపీఎల్ ఫార్మా- బై రూ. 240, స్టాప్ లాస్ రూ. 229, టార్గెట్ రూ. 265
శ్యామ్ మెటాలిక్స్- బై రూ. 1165, స్టాప్ లాస్ రూ. 1115, టార్గెట్ రూ. 1285
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


