Stock market : ట్రేడర్స్ అలర్ట్- నేటి స్టాక్స్ టు బై లిస్ట్, చమురు ధర అప్డేట్స్..
ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు చమురు ధర, లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 20 పాయింట్లు పడి 74,295 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 76 పాయింట్లు పెరిగి 23,346 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 303 పాయింట్లు పెరిగి 56,359 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 599.54 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1019.69 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.18 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.17శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.39 శాతం వృద్ధి చెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ముడి చమురు ధర స్వల్పంగా పడింది. బ్రెంట్ క్రూడ్ 0.78శాతం పడి బ్యారెల్‌కి 103.06 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్- బై రూ. 194- రూ. 197, స్టాప్ లాస్ రూ. 185, టార్గెట్ రూ. 230
సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ లిమిటెడ్- బై రూ. 808, స్టాప్ లాస్ రూ. 778, టార్గెట్ రూ. 880
సన్సెరా- బై రూ. 4265, స్టాప్ లాస్ రూ. 4065, టార్గెట్ రూ. 4765
కాన్ఫిపెట్- బై రూ. 92, స్టాప్ లాస్ రూ. 88, టార్గెట్ రూ. 101
సుదర్స్కెమ్- బై రూ. 1265, స్టాప్ లాస్ రూ . 1205, టార్గెట్ రూ. 1385
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


