శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.
Stock Market : ట్రేడర్స్ అలర్ట్- స్విగ్గీ షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే..
నవంబర్ 23, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, ముడి చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 898 పాయింట్లు పెరిగి 83,920 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 286 పాయింట్లు వృద్ధిచెంది 25,801 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1572 పాయింట్లు పెరిగి 64,635 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో డీఐఐ రూ. 4,859.80 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో ఎఫ్ఐఐలు రూ. 10,308.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 155 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 ఇక్కడి నుంచి 26,000వైపు కదలొచ్చు. అక్కడి నుంచి 26,350 వరకు వెళ్లొచ్చు. దీనికి 1, 2 వారాల సమయం పట్టొచ్చు. ఇక 25,500 వద్ద సూచీకి సపోర్ట్ లభిస్తుంది,” అని అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.93 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 3.7శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 5.6 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఫ్లాట్‌గా కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.3శాతం పడి బ్యారెల్‌కు 92.2 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
స్టాక్స్ టు బై..
నువోకో- బై రూ. 361, స్టాప్ లాస్ రూ. 340, టార్గెట్ రూ. 389
ఎన్‌హెచ్- బై రూ. 1950, స్టాప్ లాస్ రూ. 1860, టార్గెట్ రూ. 2145
సింజిన్- బై రూ. 453, స్టాప్ లాస్ రూ .427, టార్గెట్ రూ. 498
స్విగ్గీ- బై రూ. 179, స్టాప్ లాస్ రూ. 175, టార్గెట్ రూ. 190
టాటా కెమికల్స్- బై రూ. 640, స్టాప్ లాస్ రూ. 610, టార్గెట్ రూ. 700
ఆంబర్ ఎంటర్ప్రైజ్- బై రూ. 6750, స్టాప్ లాస్ రూ. 6300, టార్గెట్ రూ. 7300

E-Paper
