గురువారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 460 పాయింట్లు పడి 73,249 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 124 పాయింట్లు కోల్పోయి 22,688 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 51 పాయింట్లు పడి 54,926 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,458.70 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,891.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 165 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి కీలకమైన 20-డీఎంఏ వద్ద బలమైన అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. దానిని సూచీ అధిగమించలేకపోతోంది. ప్రస్తుతం నిఫ్టీ50కి 22,600 వద్ద కీలకమైన సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే ఇంకా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రేడర్లు జాగ్రత్త వహించి, లెవల్ అధారిత ట్రేడింగ్ చేయాలి,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్కి చెందిన టెక్నికల్ ఎనలిస్ట్ వత్సల్ భువ తెలిపారు.
Emergency fund investment : రూ. 10లక్షల ఎమర్జెన్సీ ఫండ్.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్?
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.02 శాతం పెరిగింది. కానీ ఎస్ అండ్ పీ 500 1.21శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.6 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}గురువారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.02 శాతం పెరిగింది. కానీ ఎస్ అండ్ పీ 500 1.21శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.6 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర భగభగలాడుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.8శాతం పెరిగి బ్యారెల్కు 114 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
స్టాక్స్ టు బై..
ఇండ్హోటల్- బై రూ. 785, స్టాప్ లాస్ రూ. 750, టార్గెట్ రూ. 855
క్రిసిల్- బై రూ. 4780, స్టాప్ లాస్ రూ. 4550, టార్గెట్ రూ. 5280
ఫెడరల్ బ్యాంక్- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 336, టార్గెట్ రూ. 368