...
...
Next Story

Stock Market : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 124 స్టాక్​తో లాభాలకు ఛాన్స్!

నవంబర్ 26, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​, ముడి చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 26, 2026, 07:31:28 IST
Advertisement

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1502 పాయింట్లు పెరిగి 83,938 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 470 పాయింట్లు వృద్ధిచెంది 25,819 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1118 పాయింట్లు పెరిగి 63,703 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,479.08 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,018.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 165 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 పాజిటివ్​ ట్రెండ్​లో దూసుకెళుతోంది. ప్రస్తుతం సూచీకి 25,550- 25,600 లెవల్స్​ వద్ద కీలక సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే సూచీ 25,350- 25,300 వరకు వెళ్లచ్చు. ఇక నిఫ్టీ50కి 25,900- 26,100 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది,” అని ఏంజిల్ వన్​కి చెందిన ఈక్విటీ అండ్ డెరివేటివ్స్ టెక్నికల్ ఎనలిస్ట్ హీతేష్ రథి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.3 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.3శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.6 శాతం డౌన్​ అయ్యింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర ఫ్లాట్​గా ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.06 శాతం పెరిగి బ్యారెల్​కు 94.6 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

డీఓఎంఎస్- బై రూ. 2220, స్టాప్​ లాస్​ రూ. 2130, టార్గెట్​ రూ. 2420

ఎంఫసిస్- బై రూ. 2535, స్టాప్​ లాస్​ రూ. 2470, టార్గెట్​ రూ. 2760

ఎల్​జీఇండియా- బై రూ. 1820, స్టాప్​ లాస్​ రూ. 1750, టార్గెట్​ రూ. 2100

దేవ్యానీ ఇంటర్నేషనల్- బై రూ. 124.6, స్టాప్​ లాస్​ రూ. 119, టార్గెట్​ రూ. 135

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks