శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.
Stock Market : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 124 స్టాక్‌తో లాభాలకు ఛాన్స్!
నవంబర్ 26, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, ముడి చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1502 పాయింట్లు పెరిగి 83,938 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 470 పాయింట్లు వృద్ధిచెంది 25,819 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1118 పాయింట్లు పెరిగి 63,703 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,479.08 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,018.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 165 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 పాజిటివ్ ట్రెండ్‌లో దూసుకెళుతోంది. ప్రస్తుతం సూచీకి 25,550- 25,600 లెవల్స్ వద్ద కీలక సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే సూచీ 25,350- 25,300 వరకు వెళ్లచ్చు. ఇక నిఫ్టీ50కి 25,900- 26,100 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది,” అని ఏంజిల్ వన్‌కి చెందిన ఈక్విటీ అండ్ డెరివేటివ్స్ టెక్నికల్ ఎనలిస్ట్ హీతేష్ రథి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.3 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.3శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.6 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.06 శాతం పెరిగి బ్యారెల్‌కు 94.6 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
డీఓఎంఎస్- బై రూ. 2220, స్టాప్ లాస్ రూ. 2130, టార్గెట్ రూ. 2420
ఎంఫసిస్- బై రూ. 2535, స్టాప్ లాస్ రూ. 2470, టార్గెట్ రూ. 2760
ఎల్జీఇండియా- బై రూ. 1820, స్టాప్ లాస్ రూ. 1750, టార్గెట్ రూ. 2100
దేవ్యానీ ఇంటర్నేషనల్- బై రూ. 124.6, స్టాప్ లాస్ రూ. 119, టార్గెట్ రూ. 135

E-Paper
