...
...
Next Story

Stock market : బాబోయ్ 'క్రూడ్'! భగభగలాడుతున్న చమురు ధర- ఈరోజు స్టాక్ మార్కెట్ డౌన్?

అక్టోబర్ 26, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్, ముడి చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 26, 2026, 08:17:04 IST
Advertisement

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 126 పాయింట్లు పడి 73,124 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 88 పాయింట్లు కోల్పోయి 22,600 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 638 పాయింట్లు పడి 54,287 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 887.65 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,235.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 75 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 22,300 వద్ద కీలక సపోర్ట్​ ఉంది. అది బ్రేక్ అయితే సూచీ మరింత కిందకి పడిపోవచ్చు. 22,000 వరకు వెళ్లొచ్చు. ఇది కీలకమైన సైకలాజికల్ సపోర్ట్ లెవల్​ కూడా! ఇక 22,850- 22,900 జోన్ వద్ద కీలక రెసిస్టెన్స ఉంది. అక్కడే 21 డీఎంఏ కూడా ఉంది. ఈ రెసిస్టెన్స్​ని సూచీ క్రాస్ చేయనంత వరకు ట్రేడర్లు సెల్ ఆన్ రైజ్ స్ట్రాటజీని అనుసరించడం ఉత్తమం,” అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్ డా. రవి సింగ్ తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.2 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.52శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.2 శాతం డౌన్​ అయ్యింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర సలసల కాగిపోతోంది! చాలా రోజులుగా చమురు ధర 110 డాలర్ల ఎగువనే ట్రేడ్ అవుతోంది. అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ సోమవారం బ్యారెల్​కు 114.5 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

స్టాక్స్​ టు బై..

సయంట్- బై రూ. 1235, స్టాప్​ లాస్​ రూ. 1175, టార్గెట్​ రూ. 1360

ఎటర్నల్- బై రూ. 320, స్టాప్​ లాస్​ రూ. 302, టార్గెట్​ రూ. 350

గర్వారే హై టెక్ ఫిల్మ్స్ లిమిటెడ్- బై రూ. 6970- 7075, స్టాప్​ లాస్​ రూ. 6500, టార్గెట్​ రూ. 8200

నజారా టెక్నాలజీస్ లిమిటెడ్ బై రూ. 402, స్టాప్​ లాస్​ రూ. 373, టార్గెట్​ రూ. 480

నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ- బై రూ. 71.9, స్టాప్​ లాస్​ రూ. 68.5, టార్గెట్​ రూ. 78

జీఎంఆర్​ ఎయిర్​పోర్ట్స్- బై రూ. 86.3, స్టాప్​ లాస్​ రూ. 82, టార్గెట్​ రూ. 94

రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా- బై రూ. 88.25, స్టాప్​ లాస్​ రూ. 83.8, టార్గెట్​ రూ. 96

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks