Stocks to buy : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 218 బ్రేకౌట్ స్టాక్‌తో లాభాలకు ఛాన్స్!
Stock market news today : ఆగస్టు 27, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 183 పాయింట్లు పడి 77,473 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 127 పాయింట్లు కోల్పోయి 24,208 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 267 పాయింట్లు పెరిగి 57,784 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 502.63 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,425.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 24,115 సపోర్ట్ లెవెల్‌గా ఉండనుంది. ఇది బుధవారం నాటి ఇంట్రాడే లో. దీని కన్నా దిగువకు పడితే సూచీ 24,000- 24,040 వరకు వెళ్లొచ్చు. ఇక 24,400 వద్ద నిఫ్టీ50కి కీలక రెసిస్టెన్స్ ఉంది,” అని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.23 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.02శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.08 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
గురువారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 0.6శాతం పడి బ్యారెల్‌కు 87.2 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
రస్సెల్ టెక్సిస్- బై రూ. 1100, స్టాప్ లాస్ రూ. 1048, టార్గెట్ రూ. 1190
యథార్త్ హాస్పిటల్ అండ్ ట్రౌమా కేర్ సర్వీసెస్- బై రూ. 965, స్టాప్ లాస్ రూ. 910, టార్గెట్ రూ. 1050
ఇండిగో పెయింట్స్- బై రూ. 1186, స్టాప్ లాస్ రూ. 1125, టార్గెట్ రూ. 1280
లుమాక్స్ ఇండస్ట్రీస్- బై రూ. 6160, స్టాప్ లాస్ రూ. 5785, టార్గెట్ రూ. 6700
క్రాస్- బై రూ. 218, స్టాప్ లాస్ రూ. 205, టార్గెట్ రూ. 235
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


