...
...
Next Story

Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 215 స్టాక్​తో లాభాలకు ఛాన్స్..

Stocks to buy today : ఆగస్టు 28, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 28, 2026, 08:15:52 IST
Advertisement

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 539 పాయింట్లు పడి 76,934 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 117 పాయింట్లు కోల్పోయి 24,091 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 274 పాయింట్లు పడి 57,510 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

నేడు రక్షాబంధన్. ఈ నేపథ్యంలో స్టాక్​ మార్కెట్​లకు సెలువు ఉంటుందా? అని ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆలోచిస్తున్నారు. అయితే, శుక్రవారం స్టాక్​ మార్కెట్​కు సెలవు లేదు. యథావిథిగా ట్రేడింగ్​ కార్యకలాపాలు కొనసాగుతాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 298.26 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4977.17 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 31 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.20 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.72శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.5 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

జిందాల్ సా- బై రూ. 310, స్టాప్​ లాస్​ రూ. 299, టార్గెట్​ రూ .332

సాయ్ లైఫ్​ సైన్సెస్- బై రూ. 1488, స్టాప్​ లాస్​ రూ. 1435, టార్గెట్​ రూ. 1592

బ్లూ స్టార్- బై రూ. 1497, స్టాప్​ లాస్​ రూ. 1470, టార్గెట్​ రూ. 1440

ఔరబిందో ఫార్మా- బై రూ. 1630, స్టాప్​ లాస్​ రూ. 1585, టార్గెట్​ రూ. 1680

బ్రేకౌట్ స్టాక్స్ టు బై..

వండర్​లా హాలిడేస్- బై రూ. 542, స్టాప్​ లాస్​ రూ. 519, టార్గెట్​ రూ. 585

ఓర్క్లా ఇండియా- బై రూ. 606, స్టాప్​ లాస్​ రూ. 575, టార్గెట్​ రూ. 650

బీహెచ్​ఈఎల్- బై రూ. 434, స్టాప్​ లాస్​ రూ. 470, టార్గెట్​ రూ. 470

అదానీ పవర్ - బై రూ. 215, స్టాప్​ లాస్​ రూ. 205, టార్గెట్​ రూ. 233

గ్లోబల్ హెల్త్ - బై రూ. 1509, స్టాప్​ లాస్​ రూ. 1444, టార్గెట్​ రూ. 1625

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe