Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 215 స్టాక్‌తో లాభాలకు ఛాన్స్..
Stocks to buy today : ఆగస్టు 28, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 539 పాయింట్లు పడి 76,934 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 117 పాయింట్లు కోల్పోయి 24,091 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 274 పాయింట్లు పడి 57,510 వద్దకు చేరింది.
నేడు రక్షాబంధన్. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లకు సెలువు ఉంటుందా? అని ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆలోచిస్తున్నారు. అయితే, శుక్రవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు లేదు. యథావిథిగా ట్రేడింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 298.26 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4977.17 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 31 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.20 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.72శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.5 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
బ్రెంట్ క్రూడ్ 0.3శాతం పడి బ్యారెల్‌కి 89.45 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
జిందాల్ సా- బై రూ. 310, స్టాప్ లాస్ రూ. 299, టార్గెట్ రూ .332
సాయ్ లైఫ్ సైన్సెస్- బై రూ. 1488, స్టాప్ లాస్ రూ. 1435, టార్గెట్ రూ. 1592
బ్లూ స్టార్- బై రూ. 1497, స్టాప్ లాస్ రూ. 1470, టార్గెట్ రూ. 1440
ఔరబిందో ఫార్మా- బై రూ. 1630, స్టాప్ లాస్ రూ. 1585, టార్గెట్ రూ. 1680
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
వండర్లా హాలిడేస్- బై రూ. 542, స్టాప్ లాస్ రూ. 519, టార్గెట్ రూ. 585
ఓర్క్లా ఇండియా- బై రూ. 606, స్టాప్ లాస్ రూ. 575, టార్గెట్ రూ. 650
బీహెచ్ఈఎల్- బై రూ. 434, స్టాప్ లాస్ రూ. 470, టార్గెట్ రూ. 470
అదానీ పవర్ - బై రూ. 215, స్టాప్ లాస్ రూ. 205, టార్గెట్ రూ. 233
గ్లోబల్ హెల్త్ - బై రూ. 1509, స్టాప్ లాస్ రూ. 1444, టార్గెట్ రూ. 1625
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


