బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 384 పాయింట్లు పెరిగి 77,301 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 150 పాయింట్లు వృద్ధిచెంది 23,961 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 374 పాయింట్లు పెరిగి 55,914 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 7,284.03 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,712.23 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 350 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 100-డే ఈఎంఐ 23,700 వద్ద ఉంది. అది సపోర్ట్‌గా పనిచేసే అవకాశం ఉంది. ఇక 24,000 జోన్ కీలక రెసిస్టెన్స్‌గా ఉంది. అక్కడే 200 ఈఎంఏ సైతం ఉంది. మార్కెట్లో ప్రస్తుతం బై ఆన్ డిప్స్ స్ట్రాటజీని అనుసరించవచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ ఎనలిస్ట్ వత్సల్ భువ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన రిపబ్లికెన్ పార్టీ ఓటమి వేళ బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని ఆ దేశ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 3 శాతం మేర పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.5శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.6 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పతనమైంది. గురువారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 0.62శాతం పడి బ్యారెల్‌కు 94.04 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
ఔరాఫార్మా- బై రూ. 1720, స్టాప్ లాస్ రూ. 1620, టార్గెట్ రూ. 1875
అదానీ పోర్ట్స్- బై రూ. 1915, స్టాప్ లాస్ రూ. 1800, టార్గెట్ రూ. 2130
శ్రీరామ్ ఫైనాన్స్- బై రూ. 911, స్టాప్ లాస్ రూ. 850, టార్గెట్ రూ. 1000